రీసెంట్‌గా చేతికి గాయంతో కనిపించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఆ గాయం చిన్నదే అని, ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదని క్లారిటీ వచ్చినా కూడా మెగా అభిమానుల్లో ఎక్కడో ఓ మూల చిన్న కలవరపాటు ఉండే ఉంది. అయితే తాజాగా డాక్టర్ల సూచన మేరకు మెగాస్టార్ తన లేటెస్ట్ మూవీ '' సెట్స్ మీదకు వచ్చేయడంతో అంతా కూల్ అయ్యారు. ఈ సోమవారం (నవంబరు 1) నుంచి హైదరాబాద్‌లో 'గాడ్ ఫాదర్' న్యూ షెడ్యూల్ ప్రారంభమైంది. చేతికి గాయం తగ్గిపోవడంతో చిరంజీవి సెట్స్ మీదకు చేరుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. తాజా షెడ్యూల్‌లో చిరంజీవి సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల షూటింగ్ జరపనున్నారట. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన 'లూసిఫర్' సినిమాకు రీమేక్‌గా మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. విభిన్నమైన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు కడుతుండగా.. నీరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి తల్లిగా గంగవ్వను తీసుకున్నారని టాక్. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను భాగం చేస్తున్నారట. ఇకపోతే వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిన చిరంజీవి.. అతి త్వరలో 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యపాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y5EEt5
No comments:
Post a Comment