చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లక ముందు.. ఆయన క్రేజ్ హిమాలయాలను తాకుతున్న రేంజ్‌లో ఉన్నప్పుడు ఓ సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా! అందరివాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు డైరెక్టర్ దర్శకుడు. కమర్షియల్ సినిమాలకు ఓ ప్యాట్రన్‌ను తీసుకొచ్చిన డైరెక్టర్ శ్రీనువైట్ల నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఇండస్ట్రీ వర్గాలే కాదు.. అభిమానులు కూడా అప్పుడు ఊహించలేదు. అయితే జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని మార్చలేం. అయితే అసలు సినిమా ప్లాప్ కావడం వెనుక గల కారణాలేంటి? అనే దానిపై రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు. అందరివాడు కథ నాది కాదని. మరొకరు రాసిన కథను నేను డైరెక్ట్ చేశానని. కథ రెడీగా ఉంది వచ్చి డైరెక్ట్ చేయమని నన్ను అడిగితే చేశానన్న శ్రీనువైట్ల అలాంటి సినిమాకు నేను సూట్ కాను అని అన్నారు . నిజానికి చిరంజీవిగారి ఇమేజ్‌కు తగ్గ వేరే కథ ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మరి ఆ సినిమాను షూట్ చేస్తున్న సమయంలో మరెప్పుడూ మీ కోసం ఓ కథను రెడీ చేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టి, నా కథ వినండి అని నీకు చెప్పే అవకాశం, సందర్భం రాలేదా? అని ప్రశ్నించినప్పుడు దానికి శ్రీనువైట్ల మాట్లాడుతూ, ఆయన టూ బిగ్(ఇమేజ్ పరంగా) కావడమే ప్రాబ్లమ్ అని అన్నారు. చిరంజీవి అందరివాడు 2005లో విడుదలైంది. ఈ సినిమాకు భూపతిరాజా కథను అందించారు. శ్రీనువైట్ల దర్శకుడు. కోన వెంకట్ రైటర్‌గా వర్క్ చేశారు. ఇందులో చిరంజీవి తండ్రీ కొడుకులుగా నటించారు. టబు, రిమి సేన్ హీరోయిన్స్‌గా నటించారు. అల్లు అరవింద్ నిర్మాత. ఇక శ్రీనువైట్ల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం విష్ణు మంచు హీరోగా ఢీ అంటే ఢీ అనే సినిమాను తెరకెక్కించే పనులతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించిన కథ, కథనం, ఇతర ప్రీ ప్రొవడక్షన్ పనులను పూర్తి చేయడంలో ఎంతో బిజీగా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YbgwFE
No comments:
Post a Comment