జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను దర్శకధీరుడు రాజమౌళి కలవబోతున్నారని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోన్న వార్త. కెరీర్ ప్రారంభంలో పవన్‌కళ్యాణ్‌తో రాజమౌళి సినిమా చేయాలనుకున్నారు. కానీ ఏవో కారణాలతో అది కుదరలేదు. తర్వాత వీరిద్దరూ ప్రత్యేకంగా అంటూ కలుసుకోలేదు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్, రాజమౌళి కలుసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వీరిద్దరూ ఎందుకు కలుసుకుంటున్నారు.. సినిమా చేయబోతున్నారా? అనే సందేహం రాక మానదు. అసలు విషయం ఏంటంటే వీరిద్దరూ కలుసుకునేది సినిమాకు సంబంధించిన చర్చలో భాగమేనని, అయితే ఇద్దరి కలయికలో రాబోయే సినిమా కాదని, ఇప్పటికే విడుదలకు సిద్ధమైన , భీమ్లా నాయక్ సినిమాల కోసం. ఈ రెండు సినిమాల విడుదలలు ఖరారు అయ్యాయి కదా, మరేంటి సమస్య అని అనుకోవచ్చు. కానీ.. ఇక్కడే రాజమౌళికి అసలు సమస్య వచ్చింది. అసలు రాజమౌళికి వచ్చిన సమస్య ఏంటి? RRR మూవీ అంటే పాన్ ఇండియా మూవీ. ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఆలియాభట్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్ నటిస్తున్న మూవీ. భారీ అంచనాలున్నాయి. మరి రాజమౌళి ఎందుకు ఆలోచిస్తున్నారు? అనుకోవచ్చు. RRR మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 7న రానుంది. కనీసం వారం గ్యాప్‌లో అంటే జనవరి 14న రాధేశ్యామ్‌తో ప్రభాస్ సందడి చేయబోతున్నాడు. ఈ వారంలో కలెక్షన్స్ రాబట్టేసుకోవచ్చునని జక్కన్న భావించారు. కానీ.. మధ్యలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా రిలీజ్ డేట్‌ను మార్చుకోనని చెప్పేశారు. ముందుగా ప్రకటించినట్లే జనవరి 12న రాబోతున్నట్లు ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ వంటి హీరో వస్తే బాక్సాఫీస్ వద్ద తొలి వారంలోనే కలెక్షన్స్ మీద ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ టిక్కెట్టు రేట్స్ కూడా పెంచలేదు. ఇది అక్కడ కలెక్షన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో RRR, భీమ్లా నాయక్ పోటీ పడితే బాగోదని భావించిన రాజమౌళి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి భీమ్లా నాయక్ రిలీజ్ డేట్‌ను మార్చుకోవాలని రిక్వెస్ట్ చేయబోతున్నారట. మరోవైపు RRR నిర్మాత డివివి దానయ్య, డిస్ట్రిబ్యూటర్స్ సహా వెళ్లి త్రివిక్రమ్‌ను కూడా రిక్వెస్ట్ చేసుకోబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. RRR రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ నిర్మాతలు తమ సినిమాను వాయిదా వేయాలనుకున్నా, పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని, అందుకనే వారు సంక్రాంతికి వస్తున్నారని సమాచారం. మరిప్పుడు జక్కన్న రిక్వెస్ట్ చేస్తే పవన్ ఒప్పుకుంటాడా? అనేది ఆలోచించాలి. ఒకవేళ పోస్ట్ చేసుకుంటే భీమ్లా నాయక్‌ను ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలనే దానిపై నిర్మాతలు ఆలోచించుకోవాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HHVW1v
No comments:
Post a Comment