అల్లు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. అల్లు చిన్నారులు అయాన్, అర్హ చేసే సందడితో ఎప్పుడూ నవ్వుతుండే అల్లు అర్జున్, స్నేహ సంతోషం ఇంకా ఎక్కువైంది. అందుకు కారణం.. అల్లు అర్హ. ఈ చిన్నారి చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లరిని అల్లు అర్జున్, స్నేహలు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్హ ఓ రికార్డ్‌ను సాధించింది. ఈ రికార్డ్ గురించి తెలిస్తే పిట్ట కొంచెం కూత ఘనం అని అనక తప్పదు మరి. అత్యంత చిన్న వయసులోనే ఇతరులకు చెస్‌లో శిక్షణను ఇస్తూ అర్హ అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదండోయ్ నోబుల్ బుక్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఓ చెస్ అకాడమీలో అల్లు అర్హ శిక్షణను తీసుకుంది. ఇప్పుడు ఇతరులకు చెస్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఇలా ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించిన అర్హ.. రెండు నెలల్లోనే 50 మందికి చెస్‌లో శిక్షణను ఇచ్చింది. అల్లు అర్హ ప్రతిభను గుర్తించిన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు అర్హ చెస్ స్కిల్స్‌ను పరీక్షించారు. అందులో అర్హ పాస్ అవడమే కాకుండా, అతి చిన్న వయసులో చెస్ ట్రైనింగ్ ఇస్తున్న ట్రైనర్‌గా రికార్డ్‌ను సాధించింది. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు సదరు అవార్డును రీసెంట్‌గా అర్హను అందించారు. అల్లు అర్హ చెస్ పరీక్షలో పాల్గొన్న సమయంలో, అల్లు స్నేహ ఓ వీడియో తీశారు. ఆ వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇటీవల అల్లు అర్హ నటనలోనూ అడుగు పెట్టారు. గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ శాకుంతలంలో చిన్ననాటి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఆమె నటనను చూసి సమంత వంటి స్టార్ హీరోయిన్ సైతం ఆశ్చర్యపోయినట్లు తెలియజేసింది. మరో వైపు అయాన్ కూడా వరుణ్ తేజ్ గని కోసం టైటిల్ ట్రాక్‌లో రీసెంట్‌గా నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CC0X8a
No comments:
Post a Comment