భారతీయులు ఎంతో గొప్పగా జరుపుకునే అతి కొద్ది పండుగల్లో దీపావళి ఒకటి. ఈ రోజున అందరూ ఇంటి దగ్గర ఉండి తమ బంధు మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. టాలీవుడ్ విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ కటుంబ సభ్యులు.. స్టార్ హీరోలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి ఈసారి దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు ఇతర బంధు మిత్రులు ఉన్నారు. దీనికి సంబంధించి ఓ బ్యూటీఫుల్ పిక్‌ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోను గమనిస్తే మెగాఫ్యామిలీకి చెందిన యంగర్ జనరేషన్ అంతా ఇందులో మనకు కనపడతారు. అల్లు అర్జున్ - స్నేహ, రామ్ చరణ్- ఉపాసన, అల్లు బాబీ, నిహారిక - చైతన్య, వైష్ణవ్ తేజ్ తదితరులు ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఫొటో చూస్తుంటే మరికొంత మంది మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ఈ ఏడాది పాన్ ఇండియా హీరోగా పుష్పతో తొలిసారి అడుగు వేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన తొలి పార్ట్ పుష్ప ది రైజ్.. డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విలన్. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. రెండు పాటలు మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రామ్‌చరణ్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన పాన్ ఇండియా మూవీ RRRతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఇది జనవరి 7న విడుదలవుతుంది. ఇందులో రామ్‌చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే మరోవైపు ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZPBA5t
No comments:
Post a Comment