కేరళ కుట్టి ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సాహస యాత్రలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా కిలీ మంజరో శిఖరాన్ని అధిరోహించి అందిరినీ అవాక్కయ్యేలా చేసింది. మొత్తానికి నివేదా థామస్‌లో చాలానే ప్రతిభ ఉందని నిరూపించింది. నటన, చదువుల్లోనే కాకుండా ఇలాంటి అడ్వంచెర్లు చేయడంలోనూ నివేదా ముందుంటుందని అందరికీ తెలిసేలా చేసింది. నేడు అంటే మంగళవారం నవంబర్ 2న నివేధా థామస్ బర్త్ డే. ఈ సందర్భంగా నివేదా థామస్ తాజాగా తన గురించి చెప్పుకొచ్చింది. 26 ఏళ్ల ప్రాయంలోకి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది. అంటే పాతికేళ్ల వయసులోనే ఇంత పేరు సంపాదించుకుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలీమంజారోను అధిరోహించింది. సినిమాల్లో నటనతో మంచి పేరు తెచ్చుకుంది. మొత్తానికి నివేదా థామస్ మాత్రం ఎంతో మందికి స్ఫూర్తిలా నిల్చుంది ఇక సినిమాల విషయానికి వస్తే.. నివేదా థామస్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. వకీల్ సాబ్ సినిమాలో పల్లవి పాత్రలో నివేదా అద్బుతంగా నటించింది. హిందీలో తాప్సీ పోషించిన పాత్రను నివేదా ఇక్కడ పోషించి మంచి హిట్ కొట్టేసింది. అయితే ఇప్పుడు నివేదా థామస్ సోలో హీరోయిన్‌గా ఎక్కువ ప్రాజెక్ట్‌లను చేయడం లేదు. ఆచితూచి కథలను ఎంచుకుంటోంది. నాని మీట్ క్యూట్, శంకిని డాకినీ అనే మరో సినిమాలో నివేదా నటిస్తోంది. మొత్తానికి బర్త్ డే స్పెషల్‌గా షేర్ చేసిన ఫోటోలు మాత్రం దుమ్ములేపుతున్నాయి. ఎర్ర దుస్తుల్లో హాట్ హాట్‌గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bvNGCO
No comments:
Post a Comment