ఎన్టీఆర్‌ కోసం బాలీవుడ్ బ్యూటీని దించుతున్న త్రివిక్రమ్! నందమూరి ఫ్యాన్స్ గోల పెట్టే ప్లాన్..

యంగ్ టైగర్ , మాటల మాంత్రికుడు కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో 'అరవింద సమేత' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసిన ఈ జోడీ ఈ సారి మరింత బలమైన కథతో రంగంలోకి దిగనుందట. ఈ మేరకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన త్రివిక్రమ్.. చిత్రానికి సంబంధించి అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసిన ఆయన, హీరోయిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంతో థియేటర్లన్నీ నందమూరి అభిమానుల ఈలలతో గోల పెట్టాల్సిందే అని ఫిక్స్ అయిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసేందుకు బాలీవుడ్ బ్యూటీ వరీన హుస్సేన్‌‌ని రంగంలోకి దించుతున్నారట. ఇప్పటికే ఈమెతో టెస్ట్ ఫొటోషూట్ కూడా ఫినిష్ అయిందని, త్రివిక్రమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో తారక్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తాడనే ప్రచారం కూడా జరుగుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించనుందని అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్‌ నిర్మాతలుగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, అతిత్వరలో ఈ సినిమా సెట్స్ మీదకొస్తానని త్రివిక్రమ్‌కి మాటిచ్చారట. ఎన్టీఆర్ కోసం పదునైన మాటలతో కూడిన ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేశారని, ఇందులో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని టాక్ బయటకు రావడంతో.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aB1BXg

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts