![](https://telugu.samayam.com/photo/81031692/photo-81031692.jpg)
ఆరేళ్ల వయసు నుంచే నటనలో ఓనమాలు నేర్చుకుని బాలనటిగా అనేక చిత్రాల్లో నటించిన సీనియర్ ... పదహారేళ్లకే హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన కోట్లమంది కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బొద్దుగుమ్మ రాశి. గోకులంలో సీత అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా నటించిన రాశి.. పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, మనసిచ్చిచూడు, స్వప్నలోకం, ప్రేయసి రావే వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చిత్రాలతో కలర్ ఫుల్ హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇక ఆమె సాలిడ్ అందానికి కోట్లలో అభిమానులు ఉండటంతో ఇండస్ట్రీలో 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ‘రాశి’ పోసిన అందాన్ని పెళ్లాడటం కోసం టాలీవుడ్ నుంచే కాక.. తమిళ్, కన్నడ నుంచి చాలా మంది బిజినెస్ మ్యాన్‌లు, ఇండస్ట్రీ స్టార్లు పోటీ పడ్డారు. కానీ రాశీ మాత్రం ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతోమంది కోటీశ్వరులు ఆమె కోసం ఎగబడుతున్నా.. రాశీ మాత్రం ప్రేమించిన వాడి ముందు కోట్లు ఎక్కువ కాదనుకుని చివరికి శ్రీముని అనే అసిస్టెంట్ డైరెక్టర్‌ని పెళ్లి చేసుకుంది. రాశి నటించిన అనేక చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు శ్రీముని. ఇద్దరి మధ్య స్నేహం కుదిరి ప్రేమగా మారింది. అదే టైంలో రాశి తండ్రి చనిపోవడంతో శ్రీమునికి మరింత చేరువయ్యేట్టు చేసింది. అతని కేరింగ్ నచ్చడంతో రాశీనే అతని వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకుని రావడం అతను ఓకే చేయడంతో రాశి-శ్రీమునిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెద్దల అంగీకారం అంత సులువుగా లభించకపోవడంతో.. వారిని ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది రాశీ.. వెంకీ, నిజం వంటి చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. ఈ మధ్యకాలంలో కళ్యాణ వైభోగమే, పడేశావే, ఆకతాయి వంటి చిత్రాల్లో నటించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OzRkTV
No comments:
Post a Comment