మహాబలేశ్వర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సందడి.. వారం రోజులు అక్కడే

విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కథాంశాల నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘’. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా హీరోయిన్లు. ఇటీవలే హైదరాబాద్‌లో రాత్రివేళల్లో 50 రోజుల పాటు ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తిచేయగా... ఇప్పుడు యూనిట్‌ మొత్తం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ అందమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అక్కడి లొకేషన్లలో తీసిన ఓ తాజా వీడియోనూ ట్విటర్‌లో షేర్ చేసిన నిర్మాణ సంస్థ.. సినిమాలో కీలకంగా వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిపింది. అయితే ఈ షెడ్యూల్ కేవలం వారం రోజులేనని సమాచారం. ఆ తర్వాత పుణె పరిసర ప్రాంతాల్లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుందట. సుమారు రూ.400కోట్లతో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37xk4CO

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts