డైరెక్టర్‌గా మారనున్న సునీల్... మరాఠా సినిమా రీమేక్‌కు సిద్ధం!

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని వందల సినిమాల్లో ప్రేక్షకులను నవ్వించాడు. ఆ తర్వాత హీరోగా మారిన ఆయన సిక్స్ ప్యాక్‌ కూడా చేశాడు. తొలుత రెండు మూడు హిట్లు దక్కినా ఆ తర్వాత వరుస ప్లాఫులు ఎదురయ్యాయి. దీంతో రూటు మార్చిన సునీల్ మళ్లీ కమెడియన్‌గా మారినా మునుపటి మాదిరిగా నవ్వించలేకపోతున్నాడు. అవకాశాల కోసం చూస్తున్న ఆయనకి అనుకోకుండా విలన్‌ రోల్ తలుపు తట్టింది. Also Read: ‘కలర్‌ ఫోటో’ సినిమాలో సునీల్ విలనిజాన్ని బాగానే పండించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లోనూ ఆయన ఓ విలన్‌గా నటించనున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా సునీల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించేందుకు సునీల్ సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. Also Read: ఓ మరాఠా సినిమా సునీల్‌ను బాగా ఆకర్షించిందని, దాని రైట్స్ తీసుకున్న తానే స్వయంగా రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని ఏర్పాట్ల జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3olgHW5

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts