అనారోగ్యం కారణంగా రాజకీయ పార్టీ స్థాపించడం లేదంటూ సూపర్‌స్టార్ చేసిన ప్రకటన ఆయన అభిమానులతో పాటు సెలబ్రెటీలను కూడా నిరాశపరిచింది. అయితే రజినీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజినీకాంత్ సరైన నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతుంటే, కొందరు మాత్రం ఆవేదన చెందుతున్నారు. Also Read: అయితే రజనీకాంత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ట్వీట్ చేశారు. ‘గురువా మీరు తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్. మాకు అన్నింటికంటే మీ ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. మిమ్మల్ని నమ్ముకుని మీ క్షేమం కోరుకుంటున్న వారి కోసం నిస్వార్ధమైన నిర్ణయం తీసుకున్నారు. ఇతరుల పట్ల తీసుకునే శ్రద్ధే మిమ్మల్ని గొప్పవారిని చేసింది. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని రాఘవేంద్ర స్వామిని ప్రార్థిస్తా’ అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు. Also Read: ఈ నెల 31న రాజకీయ పార్టీ ప్రకటిస్తానంటూ రజినీకాంత్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో ‘అన్నాత్తై’ షూటింగులో ఉండగా ఆయనకు రక్తపోటు పెరిగిపోయి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల తర్వాత డాక్టర్లు డిశ్చార్జ్ చేయడంతో శనివారం చేరుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లడం సరైన నిర్ణయం కాదని, రాజకీయాలు మనకొద్దని కుటుంబసభ్యులు ఆయనపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో రజినీ నిర్ణయం మార్చుకున్నారు. ‘నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. కానీ నా వల్ల మిగిలిన వాళ్లు సమస్యలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పార్టీ పెట్టడం లేదు. రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ ప్రెస్ నోట్ రాసేప్పుడు కలిగిన బాధ నాకు మాత్రమే తెలుసు’ అంటూ రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hqujNP
No comments:
Post a Comment