వెబ్‌ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ కూతురు

సూపర్‌స్టార్ గారాలపట్టీ అప్పుడే బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తింది. 3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌‌గా తెరకెక్కించిన ఫంటాస్టిక్‌ తారకు ఈ చిన్నారి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఈ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరుల సమక్షంలో విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడం పట్ల చాలా ఆనందంగా ఉందని సితార తెలిపింది. తన స్నేహితురాలు తార తనతో పాటుగా ఎదగనుందని పేర్కొంది. ఈ సిరీస్‌ మొదటి సీజన్‌ ఏప్రిల్‌లో విడుదల చేస్తామని నిర్మాతలు నయన్‌, మనీష్‌, డైరెక్టర్‌ రాజేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో సితార తన చిలిపి మాటలతో అందరినీ అలరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pj3P3f

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts