అక్కినేని అఖిల్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తోందట.
పూరీ జగన్నాథ్ దర్శక నిర్మాణంలో ఆయన తనయుడు ఆకాశ్‌తో హీరోగా వచ్చిన ‘మెహబూబా’ సినిమాలో నటించిన నేహా శెట్టిని ఇందులో సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నారట. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసినా హిట్ అందుకోలేకపోయిన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’పైనే ఆశలు పెట్టుకున్నాడు. from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JuoQsG
No comments:
Post a Comment