మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘డిస్కోరాజా’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విమర్శకులు ఈ చిత్రానికి ఓ మోస్తరు మార్కులు వేసినా ప్రేక్షకులు మాత్రం బాగా ఆదరిస్తున్నారు. మౌత్ టాక్‌తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చిత్ర యూనిట్ చెబుతోంది. తొలిరోజుతో ఈ వీకెండ్ మొత్తం థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయని పేర్కొంది. ‘డిస్కోరాజా’ను ఫ్రీకింగ్ బ్లాక్ బస్టర్‌గా అభివర్ణించిన చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. మీడియాతో తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ కార్యక్రమంలో హీరో రవితేజతో పాటు దర్శకుడు వీఐ ఆనంద్, నిర్మాత రామ్ తాళ్లూరి, నైజాం డిస్ట్రిబ్యూటర్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, చిత్ర విజయం గురించి రవితేజ ఏమీ మాట్లడలేదు. నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్ మాత్రమే మాట్లాడారు. రవితేజ ఎందుకు మాట్లాడలేదో కారణం మాత్రం చెప్పలేదు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘‘ఆడియన్స్ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. నిజానికి ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫలితం మీద మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో నాకన్నా డిస్ట్రిబ్యూటర్ మీకు బాగా చెప్తారు. మేం పడిన రెండేళ్ల కష్టానికి ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి మేం ఎంతో ఆనందంగా ఫీలవుతున్నాం. మా చిత్రానికి ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు మా యూనిట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అని అన్నారు. దర్శకుడు వీఐ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘యూఎస్ ప్రీమియర్స్ నుంచే మాకు పాజిటివ్ ఫీడ్‌బ్యా్క్ వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రతి థియేటర్‌కు వెళ్తున్నాం. ప్రతి థియేటర్‌లో ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో క్లాప్, విజిల్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రవితేజ, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో ఉన్న కామెడీ సీన్ల గురించి హైలైట్‌గా చెబుతున్నారు. ఆడియన్స్ రెస్పాన్స్‌పై చాలా సంతోషంగా ఉన్నాం. ఒక కొత్త ప్రయత్నం చేశాం. కొన్ని అంశాలు చాలా చాలా కొత్తగా ఉంటాయి. వాటన్నింటినీ ప్రోత్సహించి ఆడియన్స్ మాకు మంచి ఫలితాన్ని ఇచ్చారు. తరవాత రెండు రోజులకు కూడా అడ్వాన్స్ బుకింగులు బాగా జరుగుతున్నాయి. మంచి మౌత్ టాక్ నడుస్తోంది. మాకు ఆడియన్స్ నుంచి నేరుగా కాల్స్ వస్తున్నాయి. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూడాలని కోరుతున్నాను’’ అని చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30XP5Mn
No comments:
Post a Comment