మాస్ మహారాజా రవితేజ నటించిన సైన్స్ ఫిక్షనల్ డ్రామా ‘డిస్కోరాజా’ పైరసీ బారిన పడింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న (జనవరి 24న) విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ప్రస్తుతం ‘డిస్కోరాజా’ ఫుల్ మూవీని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొన్ని వందల లింకులు అందుబాటులో ఉన్నాయి. తొలిరోజే సినిమా ఆన్‌లైన్‌లోకి వచ్చేయడం వల్ల ఈ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉంది. పైరసీని అంతం చేయడానికి సినీ పరిశ్రమ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న సాధ్యపడటంలేదు. మరీ దారుణంగా విడుదలై కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నారు. ‘డిస్కోరాజా’ పైరసీ కూడా తమిళ్‌రాకర్స్ పనేనని సమాచారం. తమిళ్‌రాకర్స్ ‘డిస్కోరాజా’ ఫుల్ మూవీని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయగానే చాలా టోరెంట్ సైట్‌లు డౌన్‌లోడ్ లింకులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తొలిరోజు చాలా మంది ఈ సినిమాను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే, పిక్చర్ క్వాలిటీ బాగాలేదని తెలిసింది. Also Read: ‘డిస్కోరాజా’ సినిమా కోసం రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూశారు. వరుసగా మూడు డిజాస్టర్ల తరవాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడం, స్క్రిప్ట్ డిఫరెంట్‌గా ఉండటం, టీజర్లు ఆకట్టుకోవడంతో సినిమాలో ఏం చూపించబోతున్నారనే ఆత్రుత పెరిగింది. అందుకే సినిమాకు ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. కానీ, సినిమా తొలిరోజే ఇలా ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడం దారుణం. నిజానికి ఇదొక్కటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ ఇలానే పైరసీ భూతానికి బలైపోయాయి. అయినా, ఆ పైరసీ కాపీ చూడటంలో కిక్కేముంటుంది. థియేటర్‌కు వెళ్లి వెండితెరపై చూసి, నేపథ్య సంగీతాన్ని ఆస్వాదించండి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36mOfd1
No comments:
Post a Comment