Vakeel saab: పవన్ రెమ్యునరేష్‌పై షాకింగ్ న్యూస్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని దర్శక నిర్మాతలు ఆశపడుతుంటారు. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత అయిన దిల్‌ రాజుకు కూడా ఈ కోరిక బలంగా ఉండేది. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో తన ఆశ నెరవేరేదేమోనని ఆయన బాధపడేవారు. పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో వెంటనే ఆయన్ని ఒప్పించి ‘వకీల్‌ సాబ్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం పవన్ బరువు కూడా తగ్గుతున్నారు. అంజలి, నివేదా థామస్, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తికర టాక్ నడుస్తోంది. ‘’ కోసం పవన్ ఏకంగా రూ.50కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమా పూర్తయ్యేలోపు రూ.25కోట్లు, మార్కెట్ డీల్ పూర్తయ్యాక మరో రూ.25కోట్ల ఇచ్చేలా దిల్ రాజు ఆయనతో ఒప్పందం చేసుకున్నారట. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. ప్రచార మాత్రం బాగా జరుగుతోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37ugVn9

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts