బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ యాంటీ హీరో రోల్‌లో సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన ‘ఖల్‌నాయక్’ (1993) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ చేసిన బల్లూ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే దర్శకుడు సుభాష్ ఘాయ్ 27ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో సంజయ్ దత్ స్థానంలో యంగ్ హీరో నటించనున్నారు. అతడెవరో కాదు . Also Read: ‘’ సినిమాలో జాకీష్రాఫ్ హీరోగా నటించారు. ఇప్పుడు సీక్వెల్‌లో ఆయన కొడుకు యాంటీ హీరో పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ‘వార్’ సినిమాతో విలన్‌గా టైగర్ ష్రాఫ్ మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఈ పాత్రకు అతడే సరైన ఎంపికని డైరెక్టర్ భావిస్తున్నారట. సంజయ్ దత్ జైలు నుంచి బయటికొచ్చే సన్నివేశంతో సీక్వెల్ కథ మొదలవుతుందట. Also Read: తొలి భాగంలో ‘గంగ’ పాత్రలో మెప్పించిన మాధురీ దీక్షిత్ సీక్వెల్‌లో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారట. హీరోయిన్ పాత్ర కోసం ఓ ప్రముఖ నటిని సంప్రదిస్తున్నారట. తొలి భాగం గ్యాంగ్‌స్టర్ కథాంశంగా తెరకెక్కగా.. సీక్వెల్‌ను డ్రగ్ మాఫికా నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Id8t36
No comments:
Post a Comment