సుమారు తొమ్మిది నెలలుగా మూతపడిన థియేటర్లు మెగా మేనల్లుడు మూవీ ‘’తో డిసెంబర్ 25న తిరిగి తెరుచుకున్నాయి. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజే మంచి టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ పరంగా సూపర్ అనిపించగా, సెకండ్ హాఫ్ ఫర్వాలేదని చెబుతున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి హైలెట్‌గా నిలవగా, సాయి ధరమ్ తేజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోశాయని చెబుతున్నారు. ఓవరాల్‌గా మంచి ఎంటర్‌టైనర్ అని టాక్ రావడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. Also Read: చాలాకాలం తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు వస్తారా? అన్న అనుమానాలను ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా పటాపంచలు చేసింది. తొలిరోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లే దీనికి నిదర్శనం. అన్ని సెంటర్లలోనూ మొదటి ఆట నుంచే హౌస్‌ఫుల్ కలెక్షన్లు కురిపించి బాక్సాఫీసు దాహం తీర్చిందని ట్రేడ్ నిపుణుల చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమా తొలిరోజు సుమారు 4-5కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని, అతడి గత సినిమాల కంటే ఎక్కువగానే తొలిరోజు కలెక్షన్లు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అయితే ప్రధాన నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం కలెక్షన్లపై తీవ్రంగా ప్రభావం చూపిందని, లేకపోతే కనీసం రూ.10కోట్లయినా రాబట్టేదని చెబుతున్నారు. అయితే రెండు, మూడు రోజుల కలెక్షన్లను బట్టే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా తమ సినిమాలను ఇన్నాళ్లూ ల్యాబ్స్‌లోనే దాచేసిన నిర్మాతలకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫలితంతో ఆశలు చిగురించాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న, పెద్ద సినిమాలన్నింటికీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37Lt2gV
No comments:
Post a Comment