స్టార్‌ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన రాశీఖన్నా..

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. ఇప్పటికే ఇక్కడ కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. విలక్షణ నటుడు విక్రమ్, దర్శకుడు హరి కాంబినేషన్లో తెరకెక్కబోయే హ్యాట్రిక్ మూవీలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. విక్రమ్, హరి కాంబోలో గతంలో సామి, సామి-2.. సినిమాలు తెరకెక్కాయి. దీంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినా ఏ స్టార్ హీరో పక్కనా ఛాన్స్ దక్కించుకోలేకపోయిన రాశీఖన్నా కోలీవుడ్‌లో మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేసిందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి దర్శకుడు హరి, సూర్యతో ఓ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఆ ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆయన విక్రమ్‌తో సినిమా మొదలు పెట్టనున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33ytgWn

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts