పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఒక్కటే మిగిలి ఉంది. అయితే ఆ సన్నివేశాల కోసం పవన్ కాస్త సన్నబడాల్సి ఉందట. దీంతో పవన్ ఇప్పుడ బరువు తగ్గే పనిలో పడినట్లు టాక్. దీని కోసం లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఘన పదార్థాలు మానేసి పూర్తిగా ద్రవ పదార్థాలతో కూడిన ఆహారాన్నే తీసుకుంటున్నారట.
ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. అప్పటిలోగా వీలైనంత సన్నబడాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారట. హిందీ సూపర్‌హిట్ అయిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, నివేదా థామస్ హీరోయిన్లుగా, శ్రుతిహాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oiOb7t
No comments:
Post a Comment