కరోనా మహమ్మారి దేశవిదేశాలను ఓ కుదుపు కుదిపేసింది. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ వైరస్ మన దేశంలోనూ విలయతాండవం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇది సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపింది. షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో చిత్ర పరిశ్రమలోని పేదల ఆర్ధిక స్థితిగతులు దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ సడలింపులు ఇస్తున్న ప్రభుత్వం త్వరలోనే షూటింగ్స్ రీ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ '' మూవీ షూటింగ్ నిమిత్తమై పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారట. షూటింగ్స్ మొదలైనా కూడా కరోనా పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో ఉన్న భయాలు తొలగిపోయేలా కనిపించడం లేదు. అందుకే అందరిలో ధైర్యం నింపేలా 'ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్' ఉపయోగించనున్నారట సుకుమార్. ఆగస్ట్ నెల నుండి పుష్ప షూటింగ్ మొదలు పెట్టేసి ఈ మెథడ్ అప్లై చేయనున్నారట. ఇందులో భాగంగా మొదటగా నెల రోజుల పాటు పరిమిత సంఖ్యలో యూనిట్ సభ్యులను అల్లో చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఆ సమయంలో సభ్యులందరూ ఓ ప్రాంతంలోనే ఉండేలా చూస్తూ.. వాళ్ళెవరూ ఇతరులను కలవడం, అదేవిధంగా ఇతరులు వీలున్న ప్రదేశానికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేస్తారట. ఈ ప్లాన్ వర్కవుట్ అయిందంటేనే తదుపరి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారట. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్- రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ నటిస్తుండగా, పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZUDy1V
No comments:
Post a Comment