ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ హవా నడుస్తోంది. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర, వారి వారి గొప్పతనాన్ని, సాధించిన విజయాలను వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే బయోపిక్స్ రూపొందించేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అనౌన్స్ చేశారు కోన వెంకట్. ఈ రోజు (జూన్ 1) కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుపుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఎం.వి.వి.సత్యనారాయణ, ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. Also Read: అయితే ఈ చిత్రంలో కరణం మల్లీశ్వరి కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది.ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకుంటారా? లేక బాలీవుడ్ భామను ఫైనల్ చేస్తారా? అనే దానిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అతిత్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cmngl9
No comments:
Post a Comment