సినీ పరిశ్రమ నుంచి ఏడాదిలో కొన్ని వేల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. కొన్ని కమర్షియల్‌గా సక్సెస్ అవుతూ ఉంటాయి. మరికొన్ని స్టార్‌డంను బట్టి విజయం సాధిస్తూ ఉంటాయి. కానీ కొన్ని కథలు మాత్రం ప్రతీ ప్రేక్షకుడి మనసునీ తాకుతుంటాయి. అలాంటి సినిమానే ‘’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. అశ్వినీ అయ్యర్ తివారీ తెరకెక్కించారు. జస్సీ గిల్, రిచా చద్దా, నీనా గుప్తా కీలక పాత్రలు పోషించారు. ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమ కథేంటంటే.. కబడ్డీలో దిట్ట అయిన జయ (కంగన) .. జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా పేరు తెచ్చుకుంటుంది. కానీ పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఆ గుర్తింపు అంతా పోతుంది. అప్పటిదాకా చప్పట్లతో ఎంకరేజ్ చేసిన జనాలు పెళ్లయ్యాక మాత్రం కనీసం పలకరించడం మానేస్తారు. కానీ జయకి మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ సాధించాలని ఉంటుంది. ఇందుకోసం తన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలా ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటూనే మరోపక్క అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు సన్నద్ధం అవుతుంది. చివరకు ఏమైంది? అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను అందుకోగలిగిందా? అన్నది తెరపై చూడాల్సిందే. ఈ సినిమాకు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సినిమా అందరి హృదయాలను తాకుతుందని అన్నారు. ప్రతీ భారతీయుడు, అందులోనూ ప్రతీ అమ్మాయి ఈ సినిమా చూడాల్సిందేనంటూ నెటిజన్లు అంటున్నారు. కంగనా రనౌత్ పెర్ఫామెన్స్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సినిమాలో బాలీవుడ్ నటి రిచా చద్దా కూడా కబడ్డీ క్రీడాకారిణిగా చాలా బాగా నటించారని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాకు వెళ్లేటప్పుడు కచ్చితంగా తల్లిని వెంటబెట్టుకుని తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. కంగన అంటే ఇష్టపడని వారు కూడా ఈ సినిమా చూశాక ఆమెకు డైహార్డ్ ఫ్యాన్ అయిపోయామని కామెంట్స్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Gvbtn7
No comments:
Post a Comment