యాక్టింగ్ రాదు, ఇంగ్లీష్ రాదు అంటూ ఒకప్పుడు నోటికొచ్చిన ఎగతాళి చేశారు. చెత్త సినిమాల్లో నటిస్తోందని అన్నారు. అమాయకత్వాన్ని, తన కష్టాలను అలుసుగా తీసుకుని వాడుకున్నారు. తనపై బురద జల్లాలని చూసిన వారికి ఈరోజు సరైన గుణపాఠం చెప్పింది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ క్వీన్ . భారత ప్రభుత్వం కంగనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. చిత్ర పరిశ్రమకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం కంగనను ఈరకంగా సత్కరించింది. త్వరలో కంగన ‘పద్మశ్రీ’ కంగనా రనౌత్ అని పిలిపించుకోబోతున్నారు. చాలా చిన్న వయసులో కంగన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. నటన పరంగా తానేంటో నిరూపించుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ చిత్ర పరిశ్రమ ఒకప్పుడు స్టార్ కిడ్స్‌తో, క్యాస్టింగ్ కౌచ్‌తోనే నడిచేది. అదే సమయంలో కంగన సోదరి రంగోలీపై యాసిడ్ దాడి జరిగింది. తన అక్కకు మెరుగైన చికిత్స అందించడానికి కంగన చెత్త సినిమాల్లో నటించాల్సి వచ్చిందట. ఏ పాత్రకైనా ఒప్పుకుంటానని చెప్పేది. దాంతో దర్శకులు కంగనను కేవలం రొమాంటిక్ సన్నివేశాల కోసమే తీసుకునేవారు. READ ALSO: కట్ చేస్తే.. ఈరోజు సోలోగా సినిమాలను నడిపించేస్తోంది. ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన మూడు సినిమాలకు జాతీయ అవార్డులు వరించాయి. త్వరలో ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అందుకోబోతున్నారు. కంగనకు పద్మశ్రీ వచ్చిందని తెలిసి ఆమెకు సపోర్ట్ చేయని వారు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. మున్ముందు కంగన మరెన్నో సినిమాల్లో నటించి మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మనమూ కోరుకుందాం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RPh24Q
No comments:
Post a Comment