తమిళ చిత్ర పరిశ్రమలో గేయ రచయితగా బాగా పేరొందిన వైరాముత్తు ఇరవై క్రితం తనను లైంగికంగా వేధించారని చెప్పి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సింగర్ . కానీ తాను అమాయకుడినని, న్యాయం కోసం కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమని వైరాముత్తు అన్నారు. అంతేకాదు చిన్మయి ఆరోపణల్లో నిజం లేదని చాలా మంది కొట్టివేశారు. దాదాపు ఏడాదిగా చిన్మయి న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంగతి అటుంచితే.. ఇటీవల వైరాముత్తు ప్రముఖ కవి తిరువల్లువూరు జయంతి సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరువల్లువూర్ విగ్రహానికి పూల మాల వేసి ప్రసంగం ఇచ్చారు. ‘తమిళనాడులో మద్యపానమే ఓ పెనుభూతంలా మారింది. మగవారు మద్యం తాగితే వారి కాలేయాలనే కాదు కుటుంబాన్ని కూడా కోల్పోతారు. అంతేకాదు ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగేది మద్యం సేవించడం వల్లే. కాబట్టి మద్యాన్ని నిషేధించండి’ అని తెలిపారు. READ ALSO: ఓ నెటిజన్ వైరాముత్తు ప్రసంగించిన వీడియోను చిన్మయికి ట్యాగ్ చేశాడు. ఈ వీడియో విన్న చిన్మయి వైరాముత్తుపై హిలేరియస్ కౌంటర్ వేశారు. ‘20, 30 ఏళ్ల క్రితమే మద్యాన్ని నిషేధించి ఉండుంటే.. వైరాముత్తు నాపై చేసిన లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేదాన్ని’’ అని తెలిపారు. పాపం, వైరాముత్తు తనను వేధించాడని చిన్మయి చెప్పడంతో ఆమె న్యాయం జరగడం గురించి పక్కనబెడితే పనిదొరక్కుండాపోయింది. ఆమెను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. నోటికొచ్చిన మాటలు అన్నారు. అయినా చిన్మయి వెనక్కు తగ్గలేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తనకు న్యాయం జరగకపోదా అని ఎదురుచూస్తున్నారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GbuYkf
No comments:
Post a Comment