కన్నడ నటి సంయుక్త హెగ్డేపై దాడి ఘటన సద్దుమణిగిపోయింది. ఆమెపై పార్కులో దాడికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కవితా రెడ్డి హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పారు. దీనికి సంయుక్త సానుకూలంగా స్పందించి వివాదానికి ముగింపు పలికింది. కన్నడ, తమిళంతో పాటు తెలుగులో ‘కిరాక్ పార్టీ’లో సినిమాలో నటించిన సంయుక్త హెగ్దే శుక్రవారం బెంగళూరులోని ఓ పార్కుకి స్నేహితులతో కలిసి వెళ్లారు. అక్కడ స్పోర్ట్స్ డ్రెస్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఆమెతో మహిళ వాగ్వాదానికి దిగారు. అసభ్యకరంగా డ్రెస్ వేసుకుని పబ్లిక్ పార్కులోకి ఎలా వస్తావంటూ దూషణలకు దిగింది. ఆమెకు తోడు మరికొందరు మహిళలు తోడై సంయుక్తతో పాటు ఆమె ఫ్రెండ్స్‌పై దాడి చేశారు. Also Read: తనకు జరిగిన పరాభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంయుక్త వెల్లడించడంతో తీవ్ర కలకలం రేగింది. ‘మహిళలు ఏం ధరిస్తున్నారు, ఎటు వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కారణాలతో వారిని హింసించడం సమాజం ఆపాలి’ అని ఆమె పోస్ట్ చేశారు. అనంతరం దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన మహిళను కాంగ్రెస్ పార్టీకి చెందిన కవితా రెడ్డిగా గుర్తించి ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో దిగొచ్చిన ఆమె సంయుక్తకు క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తాను అలా చేసి ఉండాల్సింది కాదని, తాను చేసిన పనికి సిగ్గు పడుతున్నానని అన్నారు. దీనిపై స్పందించిన సంయుక్త.. అన్నీ మరిచిపోయి ముందుకు సాగుదామని అన్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DL33tX
No comments:
Post a Comment