సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. కెరీర్ ఆరంభం లోనే హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించి బ్రేకప్ చెప్పిన నయన్.. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. నయన్- ప్రభుదేవా పెళ్లి జరగబోతుందని అందరూ అనుకుంటుండగానే ఆ బంధం కూడా బ్రేకప్ అయింది. ఇక ముచ్చటగా మూడోసారి తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న నయనతార.. అతన్నే పెళ్లాడనుందని, అందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. లవ్ ఎఫైర్ విషయంలో ఎప్పుడూ ఓపెన్‌గా ఉండటం నయన్ స్టైల్. అందుకే ఆమె ప్రేమ సంగతులంటే జనాల్లో అదో క్రేజ్. ఈ క్రమంలోనే మూడో బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌తో విదేశాలు చుట్టివచ్చిన నయన్ తాలుకు విషయాలు వైరల్ అయ్యాయి. నయన్- సహజీవనం కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చెన్నైలో సన్నిహితుల వేడుకలో వీళ్ళిద్దరూ కలిసి పాల్గొనడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. ఇంతలో విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార ఓ పాపను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ 'నా పిల్లలకు జన్మనివ్వబోయే తల్లి' అని సంబోధించడంతో ఇక వాళ్లిద్దరూ ఒక్కటి కానున్నారని కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడేందుకు నయన్ సిద్ధమైందని తెలుస్తోంది. తాను లవ్ ఎఫైర్ నడుపుతాను తప్ప పెళ్లి పీటలెక్కను అని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే బలమైన కారణంతో నయన్ ఈ డిసీజన్ తీసుకుందట. మరోవైపు విఘ్నేష్ ఫ్యామిలీ నుంచి ఒత్తిడి రావడం కూడా నయన్ సడెన్ డిసీజన్‌కి కారణం అని టాక్. ఏది ఏమైనా నయన్ ఇంట పెళ్లి బాజాలు అనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది. చూడాలి మరి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36TCeh6
No comments:
Post a Comment