ఒకప్పుడు వెండితెరపై అందాల విందు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న .. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించడం మానుకున్నాక డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆమె.. ఈ బ్యానర్ బాధ్యతలు పూర్తిగా మోస్తూ పలు సినిమాలు రూపొందిస్తోంది. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ సక్సెస్ సాధించి లాభాలు గడించింది. కెరీర్ పరంగా విజయాలందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ పెళ్ళి చేసుకోవడానికి ఓకే చెప్పిందనే వార్తలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో షికారు చేస్తున్నాయి. 33 ఏళ్ల ఈ చార్మింగ్ బ్యూటీ ఇన్నాళ్ల పాటు తన పెళ్లి విషయాన్ని పక్కనబెట్టి కెరీర్ పరంగా స్ట్రాంగ్ అయింది. ప్రస్తుతం నిర్మాతగా సక్సెస్ బాట పడటంతో ఇక పెళ్లిచేసుకొని సెటిలవ్వాలని ఆమె ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. విషయంలో మరో ఇంట్రస్టింగ్ విషయమేమిటంటే.. ఈ పాటికే ఆమె పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు చేశారని, లాక్‌డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. అదే జరగకుంటే ఈ పాటికి ఆమె పెళ్లి జరిగిపోయుండేదని అంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై స్పందించిన ఛార్మి.. ఆ బాధ్యతలను మాత్రం పెద్దలకే అప్పగించానని, వాళ్లు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఛార్మి పెళ్లి గురించి సోషల్ మీడియాలో షికారు చేస్తున్న వార్తలు ఆమె అభిమానుల్లో సరికొత్త ఆసక్తిని రేకెత్తించాయి. వరుడు ఎవరు? అనే కోణంలో అంతా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. చూడాలి మరి ఈ వార్తలపై ఛార్మి రియాక్ట్ అవుతుందా? లేదా? అనేది. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి 'ఫైటర్' సినిమా రూపొందిస్తోంది ఛార్మి. ముంబై నేపథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్స్ రీ ఓపెన్ కాగానే ఈ మూవీ తదుపరి షెడ్యూల్స్ వివరాలు ప్రకటించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XmwWYv
No comments:
Post a Comment