బాలీవుడ్‌ను కరోనా కలకలం కొనసాగుతోంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిదే. తాజాగా ఓ నటితో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తానికి వైరస్ సోకింది. ఇండస్ట్రీలో వ్యాధి సోకిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రముఖ సినీ నటి కుమారి సింగ్‌తో సహా ఆమె కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని తేలింది. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు. తామంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్‌కు వ్యాధి సోకిందని చెప్పారు. త్వరలోనే వైరస్ నుంచి కోలుకుంటామని తెలిపారు. 'యే రిష్టా క్యా కహ్లేతా హై' టీవీ సిరియల్ ద్వారా ఆమె నటిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమె పలు టీవీ షోలలో నటించారు. గతఏడాది అక్టోబరులో ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పల్ మహారాజ్ కుమారుడు సుయేష్ రావత్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె డెహ్రాడూన్ నగరంలోని అత్తవారింట్లో నివాసముంటున్నారు. ముందుగా మోహెనా కుమారి మామ సత్పల్‌కు కోవిడ్ సోకింది. ఆ తర్వాత అత్త అమృతరావత్‌తో పాటు మొత్తం కుటుంబంలో ఏడుగురికి వైరస్ సోకడంతోనే తామంతా వ్యాధికి గురయ్యామని అన్నారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నామని కుమారి సింగ్ తెలిపారు. తన బావకు నెగిటివ్ రావడంతో ఆయనను డిశ్చార్జ్ చేశారన్నారు. తమలో చాలా తక్కువ లక్షణాలే కనిపించడంతో.. వాతావరణంలో మార్పు కారణంగా వచ్చాయని అనుకున్నమన్నారు. ఆ తర్వాత వైద్య చికత్సలు చేయించుకుంటే.. కరోనా అని తేలిందన్నారు. మొట్ట మొదటగా తమ అత్తగారిలోనే వైరస్ లక్షణాలు గుర్తించానమ్నారు. కరోనా వైరస్ ఒక దావనాంలా అంతటా వ్యాపిస్తుందని కుమారి సింగ్ తెలిపారు. ఆస్పత్రిలో చేరి రెండురోజులు అయ్యిందని ప్రస్తుతం తామంతా క్షేమంగా ఉన్నామన్నారు కుమారి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZY1DF3
No comments:
Post a Comment