సూపర్‌స్టార్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో కలలు కన్నారు. ఇంకా పార్టీ పేరు ప్రకటించలేదు కానీ ఆయన పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చేసినట్లే. అయితే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్తే.. ప్రత్యర్ధి పార్టీలు కుళ్లుకోవడం, కామెంట్స్ చేయడం చూసే ఉంటాం. కానీ ఓ సినీ దర్శకుడే రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్. సుందర రాజన్. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత 72వ జయంతి సందర్భంగా తమిళనాడులో ఓ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ ఈవెంట్‌కు సుందరరాజన్ అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ ఎక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడేసారు. "అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్‌లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవ్వరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మహానుభావుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో, చాలా మంది తమకున్న అర్హతలు ఏంటో కూడా చూసుకోకుండా సినిమాల్లోకి వచ్చేయాలని నిర్ణయించేసుకున్నారు. రజినీకాంత్ పార్టీ పెట్టి, కోయింబత్తూరులో తొలి సమావేశం ఏర్పాటుచేసారనుకోండి.. ఆయన తిరుపూరు చేరుకునేలోపే చచ్చిపోతాడు. ఆయన శరీరం అంత క్రిటికల్‌గా ఉంది మరి" READ ALSO: "ఎంజీఆర్ తన సినిమాలోని విలన్లను ఎప్పుడూ చంపలేదు. కానీ రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి నటులు తమ సినిమాల్లోని విలన్స్‌ని ఎప్పుడూ చంపాలనే చూసారు. రాజు పాత్ర కూడా కేవలం ఎంజీఆర్‌కే సరిపోయింది. రజినీ, అజిత్, విజయ్ రాజు గెటప్ వేస్తే అసహ్యంగా ఉండేవారు. ఎంజీఆర్ కూర్చున్న సీటులో వీళ్లంతా కూర్చోవాలన్న ఆలోచన కూడా ఎలా వచ్చిందో నాకైతే అర్థంకావడంలేదు’ అంటూ రెచ్చిపోయారు. వీళ్లను మాత్రమే కాదు స్టాలిన్, కరుణానిధిలతో పాటు ఇతర నేతలపై కూడా నోటికొచ్చినట్లు కామెంట్స్ చేసారు సుందర రాజన్. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vy9R4G
No comments:
Post a Comment