విజయ్ దేవరకొండ, కన్నడ భామ జంటగా రెండోసారి నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 26న (శుక్రవారం) ‘డియర్ కామ్రేడ్’ థియేటర్లలో సండడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్లనో భాగంగా రష్మిక మాట్లాడుతూ.. ‘సినిమాలో నేను క్రికెటర్‌గా కనిపిస్తాను. అందుకోసం క్రికెట్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. స్టేట్ లెవల్ క్రికెటర్‌గా కనిపిస్తాను. బ్యాటింగ్‌లో ఫోర్ కొట్టడం, అలాగే వికెట్లు కాపాడుకోవడం ఇప్పుడు నాకు తెలుసు. సినిమాల్లో బ్యాట్ పట్టుకుంటూనే నాకిలా అనిపిస్తుంది. అలాంటిది వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎంఎస్ ధోనీ పరిస్థితిని మనం ఊహించలేం. ఆ మ్యాచ్‌లో ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడం నన్ను బాధించింది. రనౌట్ అయ్యాడని అంపైర్ ప్రకటించగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. మనకే అలా ఉంటే మైదానంలో ఉండేవారికి, రనౌట్ అయిన ధోనీకి ఇంకెలా ఉంటుందో అర్థమైంది. Also Read: డియర్ కామ్రెడ్ మూవీలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. భాష రాకపోయినా తెలుగు మాటలు నేర్చుకుని డబ్బింగ్ చెప్పేశా. రెండు నెలల సమయం ఇందుకోసం శ్రమించా. మూవీ విజయం సాధిస్తుందని నమ్మకం ఉందని’ నటి రష్మిక ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2y7uHuv
No comments:
Post a Comment