దర్శకుడు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ కవి, సాహితీవేత్త కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోన్న శ్రీకాంత శర్మ.. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 1944 మే 29న జన్మించారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి 20 ఏళ్ల పాటు సేవలందించారు. అనేక లలిత గేయాలు, కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలను రచించారు. అలాగే ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో ఉప సంపాదకుడిగా, ‘ఆంధ్రప్రభ’ పత్రికకు సంపాదకుడిగా చాలాకాలం పనిచేశారు. పలు తెలుగు సినిమాల్లో పాటలు రాశారు. ‘కృష్ణావతారం’, ‘నెలవంక’, ‘రావుగోపాలరావు’, ‘రెండుజెళ్ల సీత’, ‘పుత్తడిబొమ్మ’, ‘చైతన్యరథం’ వంటి చిత్రాల్లో శ్రీకాంత శర్మ పాటలు రాశారు. తన కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ‘సమ్మోహనం’ సినిమాలోనూ ఆయన పాటను రచించారు. శ్రీకాంత్ శర్మ 1966లో సుప్రసిద్ధ కథారచయిత్రి జానకీబాలను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ఇంద్రగంటి మోహనకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. కుమార్తె కిరణ్మయి కూడా డాక్యుమెంటరీ, లఘుచిత్రాలు తీసి అవార్డులు పొందారు. ఈమె మోహనకృష్ణ కంటే పెద్దవారు. కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటోంది. కాగా, శ్రీకాంత్ శర్మ మృతికి సంతాపం తెలుపుతూ హీరో నాని ట్వీట్ చేశారు. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఆయనొక మేధావి అని, గొప్ప వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అష్టా చమ్మా’ సినిమాను చూసిన తరవాత మోహన్ గారితో పాటు తామందరనీ చూసి ఆయన ఎంత గర్వపడ్డారో ఇప్పటికీ మరిచిపోలేనని అన్నారు. మోహనకృష్ణ గారికి, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, హీరో సిద్ధార్థ్ కూడా ట్వీట్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YiduJs
No comments:
Post a Comment